నవతెలంగాణ – మద్నూర్
ప్రతి సంవత్సరం మద్నూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నారాయణ రథోత్సవాలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. శుక్రవారం ఆలయ ఆవరణంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఉత్సవాలను విజయవంతంగా జరిపించాలని నిర్ణయించారు. మే 1,2 తేదీలలో అట్టహాసంగా రథోత్సవాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీతోపాటు గ్రామ పెద్దలు పాకల విజయ్, బండి విజయ్, దరాస్ సాయిలు, వట్నాల రమేష్ ,దరాస్ సురేష్ ,హనుమాన్లు స్వామి, కృష్ణ పటేల్, కంచిన్ హనుమాన్లు, గడ్డం లక్ష్మణ్, కర్ల సాయిలు, పాకల రమేష్, గల్లి వాసులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
లక్ష్మీ నారాయణ రథోత్సవాలపై ప్రత్యేక సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



