Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: టీజీఈ జేఏసీ

పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: టీజీఈ జేఏసీ

- Advertisement -

నవతెలంగాణ – చండూరు  
తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యచరణ కమిటీ టీజీఈ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం మండల కేంద్రంలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో  చండూర్ ఆర్డీవో  శ్రీదేవికి   వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా టీజీఈ జేఏసీ నాయకులు మాట్లాడుతూ పీఆర్‌సీ కమిషన్ రిపోర్ట్‌ను తెప్పించి జూన్ 2లోపు అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని, కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే 2004 సంవత్సరం కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలని, మిగిలిన దీర్ఘకాలికంగా ఉన్న 64 అంశాలలో పెండింగ్‌లో ఉన్న వాటిని సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో టీజీఈ జేఏసీ కమిటీ అధ్యక్షులు  చండూరు యూనిట్ జి . లింగయ్య, కార్యదర్శి నిఖిల్,  ట్రెజరర్ శ్రీకాంత్, ఎంపీడీవోల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు యాదగిరి,  మండల రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రమాకాంత్ శర్మ, పెన్షన్ల సంఘం అధ్యక్షులు గోన సత్యనారాయణరావు, కార్యదర్శి రాజలింగం,  కోశాధికారి పోలా జగతయ్య, పంచాయతీ సంఘం మండల అధ్యక్షులు ఏ. కోటి, కార్యదర్శి పి. ప్రభువర్దన్ రెడ్డి, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షులు గంటా శ్రీరాములు,కార్యదర్శి సాయిరాం, టి ఏ ఈ ఓ   సంగం జిల్లా ఉపాధ్యక్షులు బి నాగార్జున,  హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీను, కుమార్ మన్యం వెంకన్న, రమ్యశ్రీ ,మెడికల్ డిపార్ట్మెంట్  ఎం. పద్మ,రజిని,  తెలంగాణ పంచాయతీ రాజ్ వి. నరసింహ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -