నవతెలంగాణ-కుభీర్ : మండలంలోని దార్ కుభీర్ గ్రామానికి చెందిన జరుగు లక్ష్మణ్ 46అనే వ్యక్తి శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలపిన వివరాలు ప్రకారం జరుగు లక్ష్మణ్ గత ఏడాది కింద అర్వెస్టర్ కొనుగుళ్ళు చేయగా తరుచు అర్వస్టర్ చెడిపోవడంతో కట్టావాల్సిన రెండు లక్షల రూపాయలు ఎలా కట్టాలో మనస్తపం చెంది గురువారం మధ్యాహ్నం సమయంలో తన స్వంత వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లి గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి తన భార్యతో చెప్పగా వెంటనే చుట్టు ప్రక్కల వారి సహాయంతో బైంసా o ప్రైవేట్ అస్పత్రి కి తరలించగా చికత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు లక్ష్మణ్ ఇటీవల స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో వార్డ్ సభ్యుడిగా గెలుపొందాడు. అలాగే విద్యాకామిటి చర్మన్ సైతం పని చేశాడు.మృతుడి భార్య కమల బాయి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ శ్రీనివాస్ తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో వార్డ్ సభ్యుడు ఆత్మహత్య..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



