Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వినూత్నంగా డెమో యాక్సిడెంట్.. రోడ్డు ప్రమాదాలపై అవగాహన

వినూత్నంగా డెమో యాక్సిడెంట్.. రోడ్డు ప్రమాదాలపై అవగాహన

- Advertisement -

జాతీయ రహదారి భద్రతపై పోలీసుల అవగాహన
నవతెలంగాణ – వర్ధన్నపేట
ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వర్ధన్నపేట పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆటో డెమో ఆక్సిడెంట్ చూపించారు. ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పించారు. వర్దన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై వర్దన్నపేట ఏసిపి సర్కిల్ పరిధిలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అర్థమయ్యే విధంగా డెమో కార్యక్రమం నిర్వహించారు. ఆటో ప్రయాణంలో ముగ్గురు నలుగురు కంటే ఎక్కువగా 7, 8 మంది చొప్పున ప్రయాణికులు వెళితే ఘోర ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఓ పనికిరాని ఆటోను రోడ్డుపై ఏర్పాటు చేసి అందులో ప్రయాణికులకు రక్తస్రావం ముగ్గురు యువకులు ప్రమాదానికి గురై ఉన్నట్లు ఎరుపు కలర్ లో రోడ్డుపై ప్రమాదం జరిగిన విధంగా చిత్రీకరించారు.

ప్రజలను నిలిపి 108 సిబ్బంది పిలిపించి ఏ విధంగా ప్రమాదం జరిగిన వెంటనే జాగ్రత్తలు తీసుకుంటారు పలు విషయాల పట్ల ప్రజలకు అర్థమయ్యే విధంగా డెమో ఆక్సిడెంట్ ఘటన కళ్ళకు కట్టినట్లు పోలీసులు అవగాహన కల్పించారు. వర్ధన్నపేట ఏసిపి అంబటి నరసయ్య, మాట్లాడుతూరోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలు, వెంటనే చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని తప్పనిసరి హెల్మెట్ ధరించాలని ప్రతి వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలన్నారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతి వ్యక్తి బాధ్యతాయుతంగా మెలగాలని ఏసిపి సూచించారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు లు మాట్లాడుతూ గతంలో జరిగిన గుర్తించి రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ప్రతి వాహనదారుడు సేఫ్ గా ప్రయాణం చేయాలని సూచించారు. కార్యక్రమంలో నేషనల్ హైవే డిఈ, ఆర్ అండ్ బి డిఈ, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్, 108 సిబ్బంది , పోలీసులు కలిసి యాక్సిడెంట్ సృష్టించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -