Saturday, April 18, 2026
E-PAPER
Homeసినిమామిస్టికల్‌ థ్రిల్లర్‌

మిస్టికల్‌ థ్రిల్లర్‌

- Advertisement -

తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహా మరో సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘పోచమ్మ’ ను సబ్‌ స్క్రైబర్స్‌ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో అంబటి అర్జున్‌, రమేశ్‌ ఇందిర, ప్రియ శతమర్షన్‌, స్నేహల్‌ కామత్‌, శృతి నాయుడు, శ్రీ పూజ, కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ వెబ్‌ సిరీస్‌ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్‌ పై శ్రుతి నాయుడు నిర్మించారు. రమేష్‌ ఇందిర దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ఈ వెబ్‌ సిరీస్‌ స్పెషల్‌ ప్రీమియర్‌ను మేకర్స్‌ నిర్వహించారు.
నటి స్నేహల్‌ కామత్‌ మాట్లాడుతూ,’ఈ వెబ్‌ సిరీస్‌లో జెస్సీ అనే క్యారెక్టర్‌లో నటించాను. ఈ సిరీస్‌ షూటింగ్‌ మొత్తం చిక్‌ మంగళూరులో చేశాం. ఈ సిరీస్‌కు నన్ను సెలెక్ట్‌ చేసుకున్న ప్రొడ్యూసర్‌ శృతి నాయుడుకి థ్యాంక్స్‌’ అని తెలిపారు.
‘ఈ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న మొదటి రోజే తప్పకుండా సక్సెస్‌ అవుతుందని నమ్మాను. ఎందుకంటే మా సిరీస్‌కు పనిచేసిన వారంతా పని రాక్షసులు. పని రాక్షసులు ఉన్నచోట పరాజయం ఉండదు. తమిళం, తెలుగులో మిమ్మల్ని తప్పకుండా ఎంగేజ్‌ చేసేలా సిరీస్‌ ఉంటుంది’ అని నటి శ్రీ పూజ చెప్పారు.
ఆహా ఓటీటీ కంటెంట్‌ హెడ్‌ కవిత మాట్లాడుతూ,’ఈ కథ విన్నప్పుడే ఈ సిరీస్‌ సక్సెస్‌ మీద మాకు నమ్మకం ఏర్పడింది. ఈ సిరీస్‌ చిత్రీకరణ మొత్తాన్ని పోచమ్మ తల్లే ముందుండి నడిపించింది అనిపించింది. మ్యూజిక్‌ కూడా బాగా కుదిరింది. మిమ్మల్ని ఆకట్టుకునేలా ఈ సిరీస్‌ ఉంటుంది. మా ఆహా ఈ ఏడాది ‘చిరంజీవ, త్రీ రోజెస్‌ సీజన్‌ 2, దూల్‌ పేట పోలీస్‌ స్టేషన్‌, సర్కార్‌, చెఫ్‌ మంత్ర’ వంటి ఇంట్రెస్టింగ్‌ కంటెంట్‌ సబ్‌ స్క్రైబర్స్‌కు అందిస్తోంది’ అని చెప్పారు. అంబటి అర్జున్‌ మాట్లాడుతూ, ‘కొన్ని కంటెంట్‌లు ముందు సైలెంట్‌గా ఉంటాయి, కానీ రిలీజ్‌ అయ్యాక మంచి సౌండ్‌ చేస్తాయి. ఈ వెబ్‌ సిరీస్‌లో అలాంటి కంటెంట్‌ ఉంది. పోస్టర్‌, టైటిల్‌తోనే మా సిరీస్‌ అందరి దష్టినీ ఆకర్షించింది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -