ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత హీరోయిన్‌గా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర టీజర్ ఇప్పటికే అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేసింది.
తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. పెళ్లి వేడుకల్లో మార్మోగి పోయేలా ఈ ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ని మేకర్స్ రూపొందించారు.
ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా.. చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఆలపించారు. ఇక సంతోష్ నారాయణన్ బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇందులో సమంత కనిపించిన తీరు, ఎనర్జిటిక్ స్టెప్పులు, క్లాసీ కొరియోగ్రఫీ అన్నీ కూడా పాటను విజువల్ ట్రీట్‌గా మార్చేసింది. ‘ఓ బేబీ’ తరువాత నందినీ రెడ్డి, సమంత కలిసి చేస్తున్న చిత్రం కావడంతో సహజంగానే ఆడియెన్స్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రాజ్ నిడిమోరు స్టోరీ, స్క్రీన్ ప్లేని అందిస్తుండటంతో మరింతగా హైప్ ఏర్పడింది. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రంగా ఈ సినిమా రాబోతోంది. సమ్మర్ కానుకగా మే 15న విడుదల చేయబోతున్నారు అని చిత్ర బృందం తెలిపింది.
దిగ్నాథ్, గుల్షన్ దేవయ్య, శ్రీ ముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు : సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు, స్టోరీ, స్క్రీన్ ప్లే : రాజ్ నిడిమోరు, వసంత్ మరిన్‌గంటి, సీతా మీనన్, దర్శకత్వం : నందినీ రెడ్డి, కెమెరామెన్ : ఓం ప్రకాష్, సంగీతం : సంతోష్ నారాయణన్, యాక్షన్ : లీ విట్టేకర్, ఏజాజ్ గులాబ్, ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ : ఉల్లాస్ హైదుర్.
‘తస్సాదియ్యా.. తగ్గేదేలా..’
- Advertisement -
- Advertisement -



