- Advertisement -
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్ మెట్రో స్టేషన్లో శుక్రవారం అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో కొంతసేపు భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకెళ్తే.. స్టేషన్లోని చెత్త డబ్బాలో గుర్తు తెలియని వస్తువులు ఉండటంతో గమనించిన ప్రయా ణికులు భయాందోళనకు గురయ్యారు. మెట్రో సిబ్బంది, అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని సమగ్రంగా తనిఖీలు చేపట్టారు. పరిశీలన అనంతరం అవి వేడుకల్లో ఉపయోగించే సాధారణ టపాకాయలేనని నిర్ధారించారు. ఈ సంఘటనతో కొంతసేపు స్టేషన్లో ఆందోళన నెలకొన్నప్పటికీ, ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -



