బీజేపీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు : తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బి.వెంకట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దక్షిణాదిపై ప్రధాని మోడీ చేస్తున్న దాడికి తమిళ ఓటర్లు ప్రతీకార తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ చెప్పారు. బీజేపీని ఓడిం చేందుకు అంతా సమయత్తమవుతున్నారని వెల్లడించారు. బీజేపీ, అన్నాడీఎంకే కూటమికి ఈ ఎన్నికల్లో దిమ్మ తిరిగే ఫలితాలు రానున్నాయని స్పష్టం చేశారు. బూత్ స్థాయి నుంచే ప్రజలు ఐక్యంగా కదులుతూ డీఎంకే కూటమికి భారీ విజయాన్ని అందించేందుకు సిద్ధ మవుతున్నారని ఆకాంక్షించారు. శుక్రవారం తమి ళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పుడుకొట్టాయి జిల్లా గంధర్వకొట్టాయి నియోజక వర్గంలో పోటీచేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నుదురై విజయాన్ని కాంక్షిస్తూ…రోడ్‌షోలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ డీలిమి టేషన్ బిల్లుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయ న్నారు. దక్షిణాది రాష్ట్రాలపై రాజకీయ, ఆర్థిక దాడి చేస్తున్న మోడీ ప్రభుత్వానికి తమిళ ఓటర్లు తమ ఓట్ల ద్వారానే గట్టి సమాధానం ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారని చెప్పారు. దక్షిణాదిలో ప్రతిఘటనకు కేరళం, తమిళనాడు ముందు వరుసలో ఉండాలని ఆకాంక్షించారు.
దేశంలో హిందూత్వ నియంతృత్వ శక్తులకు వ్యతి రేకంగా పోరాటం చేయడంలో కేరళం, తమిళనాడు రాష్ట్రాలు అగ్ర భాగాన ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడే కోటలుగా నిల వాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని చెప్పారు. హిందూత్వ నియంతృత్వ శక్తులకు తమిళనాడులో స్థానం లేదన్నారు. తమిళ సంస్కృతి, భాషపై దాడి చేస్తూ హిందూత్వ, చాతుర్వర్ణ వ్యవస్థను బలవంతంగా రుద్దాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. బీజేపీతో చేతులు కలిపిన అన్నాడీఎంకే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిం దని, ఈ ద్రోహానికి ప్రజలు ఓట్ల ద్వారానే సమాధానం ఇవ్వనున్నారని తెలి పారు. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడం, లేబర్ కోడ్లను వ్యతిరేకించడం, వ్యవ సాయ కార్మికుల హక్కులను రక్షించడం, రాజ్యాంగ పరిరక్షణ కోసం డీఎంకే కూటమి భారీ విజయం సాధించాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. తమిళనాడు ప్రజలు బీజేపీ, అన్నాడీఎంకే కూటమిని ఓడించి, డీఎంకే కూట మికి చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.



