లేదంటే తదుపరి కార్యాచరణ రూపొందిస్తాం
సచివాలయంలో నల్లబ్యాడ్జీలతో టీఈజేఏసీ నిరసన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఈజేఏసీ) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్లోని సచివాలయంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో జేఏసీ నాయకులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భం గా జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఎలూరి శ్రీనివాసరావు తదితర నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యా యులు, కార్మికులు, పెన్షనర్లు దీర్ఘకాలికంగా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని గుర్తుచేశారు. 2వ పీఆర్సీ కమిటీ వేసి 30 నెలలు గడుస్తున్నా నివేదిక రాలేదనీ, వెంటనే నివేదికను తెప్పించి 51 శాతం ఫిట్మెంట్తో జూన్ 2వ తేదీలోపు 2వ పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సుమారు రూ.13 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ, నెలవారీ జీతాలు, ఆర్థిక నిధులు ఉద్యోగులు, పెన్షనర్ల అవసరాలకు సరిపోవడం లేదని మండిపడ్డారు. కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని, ఉద్యోగులు, పెన్షనర్ ఆరోగ్య భద్రత కోసం నగదు రహిత చికిత్సను తక్షణమే అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని కోరారు.
2004 సెప్టెంబర్ ఒకటి కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలను దష్టిలో ఉంచుకుని 64 డిమాండ్లలోని పెండింగ్ అంశాలను తక్షణమే పరిష్కరించాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించలేని పక్షంలో తదుపరి కార్యాచరణ కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ నిరసనలో కో చైర్మెన్లు వంగా రవీందర్ రెడ్డి, జి. సదానందం గౌడ్, దాస్యా నాయక్, జి.శ్రీనివాస్ రెడ్డి, కె.లక్ష్మయ్య, డా.జి.సురేష్ కుమార్, డిప్యూటీ సెక్రటరీ జనరల్, ఎస్ఎం హుస్సేన్, సంయుక్త కార్యదర్శులు ఎస్. ఉమాదేవి, ఎం.బి.కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



