-రాజ్యాంగ నిపుణుల కమిటీ నియమించాలి
-విస్తృత చర్చలు జరపాలి
-దేశభక్తి ముసుగులో విభజన రాజకీయ కుట్రలు చేయొద్దు : మోడీ సర్కార్ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పై జాతీయస్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై రాజ్యాంగ నిపుణులతో కమిటీ వేసి, విస్త్రుత సంప్రదింపులు జరపాలని కోరారు. అన్ని రాష్టాలకు సమాన ప్రాధాన్యత దక్కేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచిం చారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్లో గురువారం జరిగిన విలేక రుల సమావేశంలో సీపీిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహా, కార్యదర్శి వర్గ సభ్యులు కళవేణ శంకర్లతో కలిసి కూనంనేని మాట్లాడారు. కేంద్రంలో శాశ్వత అధికారం కోసం బీజేపీ దేశభక్తి ముసుగులో విభజన రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. మహి ళా రిజర్వేషన్ల బిల్లును అడ్డం పెట్టుకుని దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం చేస్తున్నారని అన్నారు.
ఇప్పటికే దేశంలో ఉత్తరాది, దక్షణాది రాష్ట్రా ల మధ్య ఎంపీ స్థానాల్లో వత్యాసం వల్ల వివక్ష కొనసాగుతున్నదనీ, ఇప్పుడు ఎలాంటి హేతుబద్ధత లేకుండా మళ్లీ 50శాతం స్థానాలు పెంచితే ఈ వత్యా సం మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంతరాన్ని గ్రహిం చే 1975లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ 25ఏండ్లు సీట్ల పెంపును నిలిపే శారనీ, 2001లో అప్పటి ప్రధాని ఏబీ వాజ్పేయి కూడా దాన్ని 2026 వరకు కొనసాగించారని గుర్తుచేశారు. సీట్ల పెంపుపై శాస్త్రీయ అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. దానికి భిన్నంగా కేంద్రంలో శాశ్వత అధికారం కోసం బీజేపీ 50శాతం స్థానాల పెంపు ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందన్నారు. ఈ నిర్ణయాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. కేంద్ర నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న 129 ఎంపీ స్థానాలు 195కు, ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న 395 స్థానాలు 621కి పెరుగుతాయని వివరించారు.
దీనివల్ల దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిపోయి, వివక్ష పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న 543 స్థానాలు ఒకేసారి 850కి పెరిగితే అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉండదనీ, మందబలంతో అధికారంలో ఉన్న పార్టీలు ఇష్టానుసారంగా వ్యవహరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తమపార్టీ కృషి వల్లే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్తో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడని విమర్శించారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటుకు పూర్తి మద్దతును ఇచ్చిన సుష్మాస్వరాజ్ పాత్రను వీరు తప్పుపడుతున్నారా అని ప్రశ్నిం చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఖండించకపోగా, సమర్థిస్తూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఆర్టిజన్లు, సింగరేణి కార్మికులు, అసంఘటితరంగ కార్మికుల పట్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ప్రభుత్వం తప్పులు చేస్తున్నదని కూనంనేని సాంబశివరావు ఆక్షేపించారు. కార్మికుల సమస్యలపై సామరస్య పూర్వకంగా స్పందించకుండా, నిరంకుశ ధోరణ ప్రదర్శించడాన్ని తాము సహించబోమన్నారు.
డీ లిమిటేషన్పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



