Saturday, April 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకులగణనలో ముస్లింలకు అన్యాయం

కులగణనలో ముస్లింలకు అన్యాయం

- Advertisement -

– ఉపకులాల లెక్కల్లో గందరగోళం : మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్‌ పాషా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన వివరాల్లో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్‌ పాషా విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ ముస్లింలలోని 14 వర్గాలకు చెందిన 64ఉపకులాల జనాభా 35,76,588 (10.08 శాతం)గా చూపించగా, ఓసీ ముస్లిం జనాభాను 8,80,424 (2.48 శాతం)గా చూపించి, రాష్ట్రంలోని మొత్తం ముస్లిం జనాభా 44,57,012 మంది (12.56 శాతం) ప్రకటించడం సరి కాదని తెలిపారు. ఓసీ ముస్లింలలో సయ్యద్‌, ముషైక్‌, మొఘల్‌, పఠాన్‌, ఇరానీ తదితర మొత్తం 16 ఉపకులాలు ఉన్నప్పటికీ, ఉపకులాల వారీగా లెక్కించకుండా మొత్తం 2.48 శాతంగా చూపించడం ముస్లింలను తప్పుదారి పట్టించే చర్య అని ఆయన విమర్శించారు. 2007లో బీసీ-ఈ క్యాటగిరీలో ముస్లింలకు విద్య, ఉపాధి రంగాల్లో 4 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ”ఎండీ” ఇంటి పేరు లేకపోవడంతో, ఆ వర్గానికి గతంలో బీసీ-ఈ సర్టిఫికెట్లు జారీ చేయలేదని తెలిపారు. అనంతరం 2012లో అప్పటి బీసీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌, ”ఎండీ”, ”అబ్దుల్‌” ఇంటి పేర్లు కలిగిన ముస్లిం కూడా బీసీ-ఈ సర్టిఫికెట్లు పాందేందుకు అర్హులని స్పష్టం చేయడంతో, అప్పటి నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వారికి కూడా సర్టిఫికెట్లు జారీ అవుతు న్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన కులగణన జాబితాలో ”ఎండీ”, ”అబ్దుల్‌” ముస్లింలను ఎక్కడా ప్రస్తావించక పోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వారు ఏ వర్గంలోకి వస్తారో స్పష్టత లేని కార ణంగా విద్యాశాఖ నిర్వహిస్తున్న కుల గణన నమోదు ప్రక్రియలో ”ఎండీ”, అబ్దుల్‌ ఇంటిపేరు గల ముస్లింలను ఓసీ వర్గంలో నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ముస్లిం కలగణన సర్వేను పునపరిశీ లన చేసి రాష్ట్రంలోని ముస్లింలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పులు తడకలుగా చేసిన కులగణన కారణంగా పేద ముస్లింలు పలు సంక్షేమ పథకాలకు దూరమయ్యే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -