నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పోలీసు స్టేషన్‌కు వచ్చిన లాయర్‌కు ఏ అధికారంతో బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారని పంజాగుట్ట పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించారు. సింగర్ మంగ్లీ వివాదం కేసులో ఫిర్యాదు పరిశీలనకు వెళ్లిన తనకు పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయడాన్ని తప్పుపడుతూ న్యాయవాది సుబ్బారావు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఇ.వి. వేణుగోపాల్ విచారించారు. పోలీసుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు గురించి తెలుసుకోవడానికి వెళ్లిన తనపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని పిటి షనర్ లాయర్ వాదించారు. ఇరు పక్షాల వాదన లు విన్న కోర్టు, చట్ట పరిమితులను అతి క్రమించి వ్యక్తి గత స్వేచ్ఛను భంగం కలిగించవద్దని స్పష్టం చేసిం ది. వీడియో ఫుటేజీని భద్రపరచాలని ఆదేశించారు. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ పిటిషన్లపై తీర్పు రిజర్వు
తెలంగాణ ఉద్యమ సమయంలో ట్యాంక్ బండ్‌పై 2011లో జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ అగ్రనేతలు మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. వారు వేసిన పిటిషన్లను జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టారు. పిటిషనర్లను ఘటన స్థలంలో గుర్తించలేదనీ, వారి ప్రమేయానికి ఆధారాలు లేవని న్యాయవాదులు వాదించారు. మరోవైపు, ఇతర నిందితులపై చార్జి షీట్లు దాఖలైనప్పటికీ ఈ ముగ్గురిపై ఇంకా నమోదు కాలేదని పీపీ వాదించారు. వాదనలు పూర్తయ్యాక న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.
ఎన్‌హెచ్‌లకు భూసేకరణలో పునరావాసం
జాతీయ రహదారుల నిర్మాణం కోసం 1956 భూసేకరణ చట్టం కింద భూములను స్వాధీనం చేసుకున్నప్పటికీ భూమి లేదా స్థలం కోల్పోయిన వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరా వాసం, పునర్నిర్మాణ ప్రయోజనాలు కల్పించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. కరీంనగర్-వరంగల్ ఎన్‌హెచ్-563 భూసేకరణకు గురైన నిర్వాసితుల కు పునరావాస ప్రయోజనాల కోసం వారు చేసిన దరఖాస్తులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవా లని భూసేకరణ అధికారి ఆర్డీవోను ఆదేశించింది. ఈ భూసేకరణలో పునరా వాస పథకం అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎస్.కె. సాబీర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టివేయగా, వారు చేసిన అప్పీల్‌పై విచారణ చేపట్టి న చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల బెంచ్ సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది. పునరా వాస అవార్డు ప్రకటించక పోవడంతో 1956 చట్టం లోని ప్రత్యామ్నాయ నిబంధనలు వర్తించవని పేర్కొ ంది. అప్పీలు దారులు ఆర్డీవోకు దరఖాస్తు చేయా లనీ, ఎనిమిది వారాల్లో నిర్ణయం తీసుకో వాలని ఆర్దీవోను ఆదేశిం చింది. ఇళ్లను కోల్పోయిన వారికి తాత్కాలిక నివాసం కోసం అధికారులను ఆశ్రయించ వచ్చని సూచించింది.
బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఎలా చేస్తారు? :హైకోర్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



