- Advertisement -
న్యూఢిల్లీ : ఈ ఏడాది హజ్ యాత్రకు తొలి బ్యాచ్ యాత్రికులు శనివారం బయలుదేరనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వీరు బయలుదేరతారని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి (గల్ఫ్) అసీమ్ మహాజన్ తెలియచేశారు. మొత్తంగా 1,75,025 మంది యాత్రికులు ఈ యాత్రలో పాల్గొంటున్నారని తెలిపారు. రియాద్‌లోని భారత ఎంబసీ, జెడ్డాలోని భారత కాన్సులేట్ కార్యాలయాలు మైనారిటీ వ్యవహారాల శాఖతో అలాగే హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖలతో సహా సంబంధిత సౌదీ అధికారులతో సమన్వయం చేసుకుంటాయని తెలిపారు. యాత్రికులను స్వాగతించేందుకు వారు సంసిద్ధంగా వున్నారని మహాజన్ చెప్పారు.
- Advertisement -



