Saturday, April 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆస్తి పన్ను ఆఫర్‌కు ఆదరణ

ఆస్తి పన్ను ఆఫర్‌కు ఆదరణ

- Advertisement -

– ఐదు శాతం డిస్కౌంట్‌తో భారీ రాబడి
– 131 మున్సిపాల్టీల్లో రూ. 81.10 కోట్ల వసూలు : టికే శ్రీదేవి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మున్సిపల్‌ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి (ఎమ్‌ఏయూడీ) శాఖ తీసుకొచ్చిన ఐదు శాతం రాయితీ విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. ఆస్తి పన్ను చెల్లింపుదారుల్లో ఈ ఆఫర్‌కు అదరణ పెరుగుతోంది. పదిహేను రోజుల్లో పది మున్సిపాల్టీల్లో వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. జమ్మికుంట మున్సిపాల్టీ ముందంజలో ఉన్నది. ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపులపై ఐదు శాతం రాయితీ అందించే ‘ఎర్లీబర్డ్‌’ పథకానికి అదరణ లభిస్తున్నది. దీని ఫలితంగా మొదటి 16 రోజుల్లోనే 131 మున్సిపాల్టీల నుంచి రూ.81 కోట్లకు పైగా వసూలయ్యాయి. అత్యధిక ముందస్తు పన్ను వసూళ్లతో జమ్మికుంట మున్సిపాల్టీ అగ్రస్థానంలో నిలిచింది. రూ.68 లక్షలు వసూలు చేసి, 18.73 శాతానికి చేరుకుంది. నిర్దేశించిన లక్ష్యంలో 0.31 శాతం వసూళ్లతో భూపాలపల్లి అట్టడుగున ఉన్నది. మున్సిపల్‌ శాఖ అధికారుల సమాచారం ప్రకారం 131 మున్సిపాల్టీల నుంచి మొత్తం రూ.1,670.48 కోట్లు వసూలు చేయాలని అంచనా. ఏప్రిల్‌ 16 నాటికి 1.68 లక్షలకుపైగా ఆస్తుల నుంచి రూ.81.10 కోట్లుగా (4.86 శాతం) వసూలయ్యాయి. ఆరు పట్టణ స్థానిక సంస్థల్లో అత్యధికంగా దాదాపు 15 శాతం ఆదాయాన్ని రాబట్టాయి. అత్యధిక వసూళ్లు సాధించిన ద్వితీయ స్థానంలో చౌటుప్పల్‌ మున్సిపాల్టీ నిలిచింది. రూ.1.31 కోట్లు (16.25 శాతం) వసూలు చేసింది. గడ్డపోతారం మున్సిపాలిటీ రూ.1.13 కోట్లు (16.14 శాతం), హుజూరాబాద్‌ మున్సిపాలిటీ రూ. 47 లక్షలు (15.31 శాతం), భూపాలపల్లి మున్సిపాల్టీ రూ.96.87 లక్షలు వసూలు కావాల్సి ఉన్నది. ఇప్పటివరకు కేవలం రూ. మూడు లక్షలకే (0.31) పరిమితమైంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాల్టీ కేవలం రూ 20వేల దగ్గరే ఉన్నది. ఖమ్మంలోని కల్లూరు మున్సిపాలిటీ రూ. 94 లక్షల లక్ష్యానికి గానూ రూ. ఒక లక్ష వసూలు చేసింది. ఒక నెల ‘ఎర్లీ బర్డ్‌’ పథకం మొదటి పక్షం రోజుల్లో 131 పట్టణ స్థానిక సంస్థలు 81.10 కోట్లు వసూలు చేయగా, మూడు కమిషనరేట్‌ పరిధిలో రూ. 261 కోట్లు వసూలు జరిగాయి.

రాయితీ సత్పాలితాలు ఇస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆస్తి పన్నుల్లో ఐదు శాతం రాయితీ సత్పాలితాలను ఇస్తోంది. ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించడం ద్వారా మున్సిపాల్టీల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.
రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి టికె శ్రీదేవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -