ఒక్కరోజే రూ.30వేలు పోగొట్టుకున్న వైనం
నవతెలంగాణ- దుండిగల్
ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ వ్యసనం మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. తక్కువ సమయంలో అధికంగా డబ్బు సంపాదించాలని ఆశపడి గేమింగ్‌కు బానిసైన ఓ యువకుడు ఒక్క రోజులోనే రూ.30 వేలు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన సోంపాల్(32) 8 ఏండ్ల్ల కిందట నగరానికి వచ్చి కుటుంబంతో కలిసి దుండిగల్ తాండా-2లో నివసిస్తూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆన్లైన్ గేమింగ్‌కు బానిసై శుక్రవారం ఒక్క రోజే సుమారు రూ.30 వేల వరకు నష్టపోయాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో సీలింగ్ రాడ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్లైన్ గేమ్‌తో ఆర్థిక నష్టాలు.. ఆటోడ్రైవర్ ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



