ఈ నెల 20న సీఎంతో కలిసి మేడిగడ్డను సందర్శిస్తాం
పునరుద్ధరణ పనుల ప్రణాళికపై ఎన్డీఎస్ఏ సంతృప్తి : నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తమ ప్రభుత్వానికి వివక్ష లేదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలిస్తామని పేర్కొన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మెన్ అనిల్ జైన్‌తో కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణపై చర్చించామని తెలిపారు. గోదావరికి వరదలు వచ్చేలోగా సాయిల్ టెస్టింగ్, డిజైన్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంపై కేసీఆర్ హయాంలో చేసిన తప్పిదాలను సరి చేస్తున్నామని చెప్పారు. రూ.97 వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్ట్ పనికి రాకుండా పోయిందన్నారు. కాళేశ్వరంపై ప్రతి ఏడాది రూ.10వేల కోట్ల వడ్డీ కడుతున్నామని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మేడిగడ్డ డ్యామేజ్ సాయిల్ టెస్ట్, డిజైన్ల ఖర్చులను కాంట్రాక్ట్ సంస్థలే భరిస్తాయని మంత్రి తెలిపారు.
పునరుద్ధరణ పనులపై ఎన్డీఎస్ సంతృప్తి
కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులను పూర్తిగా శాస్త్రీయ విధానంలో, పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఎన్డీఎస్ చైర్మెన్ అనిల్జైన్కు వివరించామని మంత్రి తెలిపారు. బ్యారేజీల రిపేర్లు, పునరుద్ధ రణకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణ ప్రణాళికపై చర్చిం చామన్నారు. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలను వివరించామని తెలిపారు. అన్ని కోణాల్లో నిపుణుల ఆధ్వర్యంలో ప్రస్తుతం పరీక్షలు చేపడుతున్న తీరుపై ఎన్డీఎస్ఏ చైర్మెన్ సంతృప్తి వ్యక్తం చేశారని వివరించారు. త్వరలోనే తాను స్వయంగా బ్యారేజీల సందర్శనకు వస్తానని హామీ ఇచ్చారని ఉత్తమ్ తెలిపారు.
కాళేశ్వరంపై సర్కార్‌కు వివక్ష లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



