నేనిప్పుడు
పౌరుడ్నే కాదు
ఉద్యమకారుడ్ని కూడా..
నా ఓటు కోసమే కాదు
ఓటులేని పౌరుల కోసం
ఉద్యమిస్తున్నా చూడు
ఉద్యమాలోచనలు
నన్నావహిస్తున్నాయి
ఉద్యమ పథంలో
నా అడుగులు పడుతున్నాయి
రాజ్యానికిప్పుడు
రెండు ఉక్కుపాదాలు
పోలీసుది గుండాది
అణిచేకొద్దీ పెరిగే
ఆలోచనల పదును
అడుగుల పరుగు
మెట్లమీద నుంచి
ఖాళీ అధికార చెంబు
డొల్లుతోంది నేడు
ఎక్కడాగుతుందో చూడు
ప్రజాస్వామ్య పోరాటం
ప్రాణం పోసుకునే
నవయుగ లక్షణం
అర్థంకాని బత్తాయిలిక
తోకముడవడమే తరువాయి
– కె. శాంతారావు, 9959745723






కామెంట్‌లు (0)