Magazines

ఈ నెల 20 వరకు కేంద్ర బలగాలను ఉప‌సంహ‌రించొద్దు

1 గంట క్రితం

until the 20th of this month.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 2 నిమిషాల చదవడం

కేంద్ర‌ హోం మంత్రిత్వ శాఖ‌కు ఢిల్లీ పోలీసులు లేఖ‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఆందోళనలు ఇంకా కొన‌సాగుతున్న‌ నేపథ్యంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్‌)ల‌ను ఇప్పుడే ఉససంహ‌రించ‌వ‌ద్ద‌ని, కేంద్ర బ‌లగాల‌ మోహరింపును ఈనెల 20 వరకు పొడిగించాలని ఢిల్లీ పోలీసులు కోరారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌కు లేఖ రాశారు. ఈ విష‌యాన్ని ఢిల్లీ ఉన్న‌తాధికారులు మంగళవారం వెల్లడించారు. ఆందోళనలు పెరిగే అవకాశం ఉందనే నిఘావర్గాల సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడటంతోపాటు ఉద్రిక్తతలకు తావులేకుండా ఉండేందుకే గడువు పెంచాలని కోరినట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం విధుల్లో ఉన్న 273 కంపెనీల బలగాల మోహరింపు గడువు సోమవారంతో ముగిసింది. మ‌రోవైపు జంతర్‌మంత‌ర్‌, ఎన్నికల సంఘం కార్యాలయం, పార్లమెంట్ హౌస్, ఇండియా గేట్ వంటి ప్రాంతాల్లో నిరసనలు మరింత తీవ్రమమ్యే అవకాశం ఉంది. ఈ 273 సిఎపిఎఫ్‌ కంపెనీల మోహరింపును పొడిగించాలని పోలీసులు త‌మ‌ లేఖలో పేర్కొన్నారు. నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మొత్తం 301 కంపెనీల సిఎపిఎఫ్‌ బలగాలకు అనుమతి లభించింది. అక్టోబర్‌ 6న 221 కంపెనీలకు, 8న మరో 80 కంపెనీలకు ఆమోదం తెలపడంతో ఆ కంపెనీలు విధుల్లో పాల్గొన్నాయి. అదనంగా మంజూరైన 80 బలగాల్లో 28 సోమవారం నాటికి ఢిల్లీకి చేరుకోలేదు.

రేపటికి సుప్రీంకోర్టు విచార‌ణ వాయిదా

ఢిల్లీ నిరసనలకు సంబంధించి ప్రస్తుతం పలు పిటిషన్లు మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టు ముందుకొచ్చాయి. నిరసనలకు సంబంధించి కోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ జర్నలిస్టులు దాఖలు చేసిన పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ప్రస్తావించారు. ఈ పిటిషన్లపై విచారణ జరపాలంటే సంబంధిత ఫైళ్లను పరిశీలించాలని సిజెఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ కేసులను విచారణకు స్వీకరిస్తామని, అయితే నేడు సాధ్యం కాకపోవచ్చని, రేపు విచారణ చేస్తామని ఆయన తెలిపారు. మరోవైపు, న్యాయవాదులపై దాడులు జరిగాయని పేర్కొంటూ బార్ సభ్యులకు సంబంధించి దాఖలైన మరో పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ ప్రస్తావించారు. ఈ కేసును నేడు విచారించాలని ఆయన కోరగా, నేడు సాధ్యం కాదని సిజెఐ స్పష్టం చేశారు. జస్టిస్ మోహనా అనారోగ్యంతో, జ్వరంతో బాధపడుతున్నప్పటికీ విచారణకు హాజరయ్యారని సీజేఐ ఈ సందర్భంగా తెలిపారు. ముందుగా పిటిషన్లలోని లోపాలను సరిచేయాలని సూచించారు. లోపాలు సరిచేస్తే అన్ని పిటిషన్లను విచారణకు జాబితా చేస్తామన్నారు. 15న‌ ఉదయం 11 నుంచి 11:30 గంటల మధ్య విచారణ చేపట్టే అవకాశం ఉందని, ఇవి చాలా తీవ్రమైన అంశాలని, వాటిని పరిశీలించాలని అనుకుంటున్నామని సీజేఐ చెప్పారు.

నిర‌స‌న‌ల సంద‌ర్భంగా విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌పై పోలీసులు దాడికి సంబంధించి వివ‌ర‌ణ ఇచ్చేందుకు ఢిల్లీ పోలీస్ శాఖ‌లోని సీనియ‌ర్ అధికారి విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. అక్టోబ‌ర్ 9న ఇచ్చిన ఆదేశాల అమ‌లుపై నివేదిక‌తో పాటు, కోర్టు ధిక్క‌ర‌ణ‌కు సంబంధించిన పిటిష‌న్ల‌పై స‌మాధానాలు స‌మ‌ర్పించేందుకు కేంద్రం త‌ర‌పున గ‌డువు కోర‌గా, అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించింది. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్, జ‌స్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జ‌స్టిస్ వి.మోహ‌న‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం మంగ‌ళ‌వారం ఈ పిటిష‌న్లు విచారించాల్సి ఉంది. అయితే జ‌స్టిస్ మోహ‌న అనారోగ్యానికి గురికావ‌డంతో విచార‌ణ‌ను ఈన ెల 15కు వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్