- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండి ఏటీజీహెచ్ వరకు క్యూలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఏడుకొండలవాడిని 79,100 మంది దర్శించుకున్నారు. 32,791 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు లభించింది.
- Advertisement -