నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా రూరల్ లవ్‌స్టొరీతో రూపొందిన చిత్రం ‘కన్యా కుమారి’. రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాతగా రూపొం దించిన ఈ చిత్రంలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈనెల 27న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ, ‘డైరెక్టర్ సజన్ ఈ సినిమా చూడమని చాలా రోజులుగా అడిగారు. తర్వాత మధు శాలిని ఈ సినిమా గురించి చెప్పారు. కచ్చితంగా ఇలాంటి ఒక మంచి టీంకి సపోర్ట్ చేయాలని అనిపించింది. ఈ సినిమా చూశాను. మంచి స్క్రీన్ ప్లేతో లైటర్ వీన్ ట్రీట్మెంట్‌తో డైరెక్టర్ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. పంట పొలాలతో ఒక ప్రేమ కథని ముడి పెడుతూ చెప్పడం అనేది నాకు చాలా నచ్చింది. సినిమా స్క్రీన్ ప్లే చాలా బ్యూటీఫుల్‌గా ఉంటుంది. గీత్ సైని, శ్రీచరణ్ చాలా క్యూట్‌గా కనిపించారు. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి థియేటర్లో రిలీజ్ చేస్తానని చెప్పడానికి మెయిన్ రీజన్ ఈ సినిమా నాకు చాలా నచ్చింది. గత నాలుగు రోజులుగా ఈ సినిమాని చూసి నాకు చాలా మంది ఫిలిం మేకర్స్ బాగుందని చెఫ్తున్నారు’ అని అన్నారు.
‘ఈ సినిమా మొదలైనప్పుడే బన్నీ వాసుకి చూపిస్తే బాగుంటుందని అనుకున్నాను. కచ్చితంగా కథలోని కొత్తదనానికి ఆయన ప్రోత్సహిస్తారు అని నమ్మకం ఉండింది. ఆయనకు ఈ సినిమా నచ్చి, రిలీజ్ చేయడం మా మొదటి సక్సెస్‌గా భావిస్తున్నాం’ అని డైరెక్టర్ సజన్ చెప్పారు. మూవీ ప్రజెంటర్ మధుశాలిని మాట్లాడుతూ, ‘ఈ సినిమా మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఈ సినిమా చూసినప్పుడే కచ్చితంగా ఈ సినిమాని ప్రమోట్ చేయాలనిపించింది. డైరెక్టర్ ప్యాషన్, డెడికేషన్.. ఆ జర్నీ అంత విన్న తర్వాత నేను ఈ మాత్రమైనా చేయకపోతే ఇండిస్టీలో ఉండి వధా అనిపించింది. ఇంత మంచి సినిమాతో అసోసియేట్ కావడం, బన్నీ వాసు మాకు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది’ అని తెలిపారు.