ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ ప్రభుత్వానికి టోకరా
రవాణా చార్జీల పేరుతో రూ.1400 కోట్లు వసూలు
జైపూర్ : అదానీ గ్రూపునకు చెందిన బొగ్గు మైనింగ్ సంస్థ రాజస్తాన్ ప్రభుత్వానికి రూ.1,400 కోట్ల మేరకు టోకరా వేసింది. రవాణా ఛార్జీల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ మొత్తాన్ని రాబట్టింది. అసలు అదానీ సంస్థకు ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేదని జైపూర్‌లోని ఓ జిల్లా కోర్టు జులైలో తేల్చింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్న విద్యుత్ కొరతను నివారించడానికి అదానీ సంస్థ వేసిన ఎత్తుగడలకు అంగీకరించాల్సి వచ్చిందని విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అంతేకాక అదానీ సంస్థ తనపై నిరంతరం ఒత్తిడి తెచ్చి అక్రమ లాభాలు దండుకున్నదని ఆరోపించింది.
అదానీ గ్రూపు సంస్థ యాభై లక్షల రూపాయల జరిమానా చెల్లించాలంటూ జూలై ఐదవ తేదీన ఇచ్చిన తీర్పులో కోర్టు ఆదేశించింది. రాష్ట్ర సర్కారుకు, అదానీ గ్రూపు సంస్థకు మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆడిట్ చేయాల్సిందిగా కాగ్‌ను కోరాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే 13 రోజుల తర్వాత ఈ ఆదేశాలపై రాజస్తాన్ హైకోర్టు స్టే విధించింది. అయినప్పటికీ రెండు దశాబ్దాల క్రితం కుదిరిన ఒప్పందానికి సంబంధించిన కీలక వివరాలను జిల్లా కోర్టు మొట్టమొదటిసారిగా బయటపెట్టింది. ఫలితంగా మన దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారిన బొగ్గు కాంట్రాక్టులలో ఒకటిగా నిలిచిన ఈ ఒప్పందం పబ్లిక్ డొమైన్‌లో ప్రత్యక్షమైంది.
ఏమిటీ ఒప్పందం?
2007లో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన హస్డియో అరంద్ అడవులలో ఓ బొగ్గు బ్లాకును రాజస్తాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్‌కు (ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్) కేటాయించింది. ఇది రాజస్తాన్ రాష్ట్ర విద్యుత్ సంస్థ. పర్సా ఈస్ట్ అండ్ కెంట్ బసన్‌గా పిలిచే ఈ బొగ్గు బ్లాకులో 450 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఆ తర్వాత అప్పటి వసుంధర రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్ ఉమ్మడి భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. బొగ్గును తవ్వి ఛత్తీస్‌గఢ్ నుంచి రాజస్థాన్‌లోని ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్ విద్యుత్ ప్లాంట్లకు రవాణా చేసేందుకు వీలుగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఓ కంపెనీని ఏర్పాటు చేసింది. ఆ కంపెనీ పేరే పర్సా కెంట్ అండ్ కెంట్ కాలరీస్ లిమిటెడ్. దీనిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ వాటా 74 శాతం. ప్రభుత్వ యాజమాన్యంలోని ఆర్‌ఆర్‌వీ యూఎన్‌ఎల్ సంస్థకు 26 శాతం వాటాలు ఉన్నాయి. అంటే ఉమ్మడి భాగస్వామ్యంలో అదానీ గ్రూపుదే పై చేయి అన్న మాట.
ప్రయివేటు కంపెనీలకు అనుమతులా?
ఇది దేశంలోనే ఓ కొత్త తరహా ఒప్పందం. ఈ ఒప్పందం కింద ప్రభుత్వం ప్రయివేటు కాంట్రాక్టరుకు మైనింగ్ సేవల నిమిత్తం ఫీజు చెల్లించింది. దీనిపై అనేక మంది స్వతంత్ర నిపుణులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వ రంగం వినియోగం కోసం కేటాయించిన బొగ్గు గనుల నుంచి లాభాలు దండుకునేందుకు ప్రయివేటు భాగస్వామ్య సంస్థలను అనుమతించడం ఏమిటని వారు నిలదీశారు. గతంలో బొగ్గుపై ఆధారపడిన ప్లాంట్లను కలిగిన కంపెనీలకు…అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాలు వంటి వాటికి మాత్రమే బొగ్గు గనులు కేటాయించే వారు. గనుల కోసం పోటీ పడే ముందు ఆయా కంపెనీలు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
నష్టాలు సర్కారువి…లాభాలు ప్రయివేటు సంస్థవి
అయితే ఇలాంటి ఒత్తిడులేవీ లేకుండానే తేలికగా సొమ్ము సంపాదించుకునేందుకు ప్రైవేటు కంపెనీలను ఈ కొత్త తరహా ఒప్పందం అనుమతిం చింది. సొంతగా నడిపే పెద్ద విద్యుత్ ప్లాంటు లేకపోయినా ఒప్పందం కుదుర్చు కున్నారు. ఆ ఖర్చునంతటినీ రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. ‘బొగ్గు వ్యాపారంలో వచ్చే నష్టాలన్నిం టినీ ప్రభుత్వ రంగ సంస్థే భరిస్తుంది. ప్రైవేటు కంపెనీ మాత్రం లాభదా యకమైన గనులను రహస్య ధరకు దొడ్డిదారిన సొంతం చేసుకుం టుంది’ అని పరిశోధకుడు డాక్టర్ ప్రియాన్షు గుప్తా తెలిపారు. ప్రయివేటు సంస్థకు ఇంతకంటే గొప్ప ఒప్పందం ఏముం టుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాతి కాలంలో అదానీ దేశంలో నే అతి పెద్ద బొగ్గు గనిని అభివృద్ధి చేసిన వ్యక్తిగా, నిర్వాహ కుడిగా పేరు తెచ్చుకు న్నారు. 2,800 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వకా నికి సంబంధించి తొమ్మిది కాంట్రాక్టులు సొంతం చేసుకున్నారు. అదానీ నేతృత్వంలోని సంస్థకు, రాజస్తాన్ రాష్ట్ర విద్యుత్ సంస్థకు మధ్య 2020లో మొదలైన న్యాయ పోరాటం ఈ ఏడాది పరాకాష్టకు చేరింది. దేశంలో అదానీకి చెందిన అత్యంత లాభదాయకమైన బొగ్గు గని కాంట్రాక్టులలో ఒకటి అరుదైన తనిఖీకి నిలవాల్సి వచ్చింది.
అడ్డగోలుగా అదానీ వాదనలు
అయితే వివాదం ఈ మొత్తానికి సంబంధిం చింది కాదు. దానిని ప్రభుత్వ సంస్థే చెల్లించింది. రవాణా చార్జీల రీయం బర్స్‌మెంటులో జాప్యం జరిగినందున రాష్ట్ర ప్రభుత్వ సంస్థ వడ్డీ చెల్లించాలని అదానీ కంపెనీ కోరడంతో వివాదం తలెత్తింది. రవాణా óచార్జీలను ముందుగా అదానీ సంస్థ చెల్లించాలని, ఆ తర్వాత పక్షం రోజులలో వాటిని రాజస్తాన్ ప్రభుత్వ కంపెనీ రీయంబర్స్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి అదనంగా మరో ఏడు రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంది. అయితే ఈ కాలనిర్ణయమేదీ ఒప్పందంలో లేదని కోర్టు తన తీర్పులో గుర్తు చేసింది. చెల్లింపులలో జాప్యం జరిగినందున తాను బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని అదానీ సంస్థ వాదించింది. జాప్యం కారణంగా బ్యాంకు రుణంపై అరవై ఐదు కోట్ల రూపాయల వడ్డీ భారం పడిందని తెలిపింది. కాబట్టి ఆ వడ్డీని కూడా తనకు చెల్లించాలని అదానీ సంస్థ డిమాండ్ చేసింది. అయితే బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందుకు నిరాకరిం చింది. మధ్యవర్తిత్వానికి కూడా ప్రభుత్వ సంస్థ అంగీకరించలేదు. దీంతో 2020 జూలైలో అదానీ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఆ సమయంలో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్తాన్‌లో అధికారంలో ఉంది. అదానీ గ్రూపు చర్యలపై న్యాయ స్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు రైల్వే ట్రాక్‌ను నిర్మించాల్సిన బాధ్యత అదానీ సంస్థదేనని, తాను చేసిన తప్పిదానికి కనీసం రోడ్డు రవాణా ఛార్జీలనైనా చెల్లించి ఉండాల్సిందని తెలిపింది. కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అదానీ సంస్థకు రూ.50 లక్షల జరిమానా విధించింది. దీనిపై అదానీ సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో స్టే లభించింది.
వివాదానికి కారణమేమిటి?
ఒప్పందం ప్రకారం అదానీ సంస్థ బొగ్గును తవ్వి, దానిని రాజస్తాన్‌లోని ప్రభుత్వ సంస్థకు చెందిన విద్యుత్ ప్లాంట్లకు రవాణా చేయాల్సి ఉంటుంది. 2013లో బొగ్గు తవ్వకం మొదలైంది. కానీ ఆ సమయంలో గనుల నుంచి బొగ్గును సమీపంలోని రైల్వే స్టేషన్లను రవాణా చేసే రైల్వే ట్రాక్స్ ఏవీ లేవు. ఒప్పందం ప్రకారం ఆ ట్రాక్స్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత అదానీ సంస్థదే. అయితే గని నుంచి రోడ్డు మార్గంలో రైల్వే స్టేషన్‌కు బొగ్గును తరలించాలని రెండు సంస్థలు అంగీకారానికి వచ్చాయి. వాస్తవానికి రోడ్డు రవాణా అనేది ఒప్పందంలో లేదు. రోడ్డు మార్గంలో బొగ్గును రవాణా చేసేందుకు రెండు సంస్థలు 2013 మార్చిలో ఓ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఏజెన్సీకి చేయాల్సిన చెల్లింపుల పైనే కేసు నడిచింది. రవాణా ఖర్చులను ప్రభుత్వ సంస్థే భరించిందని కోర్టు గుర్తించింది. అయితే గని నుంచి సమీప రైల్వే స్టేషన్‌కు బొగ్గును రవాణా చేయాల్సిన బాధ్యత అదానీ సంస్థదే అయినందున అది ఆ మొత్తాన్ని చెల్లించకుండా తప్పించుకుంటుందని భావించడం ‘ఊహకు అందని విషయమ’ని వ్యాఖ్యానించింది. రవాణా ఖర్చుల నిమిత్తం ప్రభుత్వ సంస్థ చెల్లించిన మొత్తం రూ. 1,400 కోట్లు.
అదానీ దబాయింపులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



