Friday, May 9, 2025
Homeతెలంగాణ రౌండప్తునికాకు సేకరణ బంద్ చేసిన ఆదివాసీలు..

తునికాకు సేకరణ బంద్ చేసిన ఆదివాసీలు..

- Advertisement -

ఆదివాసీలతో ఫారెస్ట్ అధికారుల సమావేశం విఫలం ..
నవతెలంగాణ – తాడ్వాయి
: గత 13 సంవత్సరాల నుండి తునికాకు బోనస్ రాలేదని, నిరసనగా తునికాకు సేకరించే, లింగాల, బంధాల గ్రామాలఏజెన్సీ ఆదివాసి గిరిజనులు బంద్ చేశారు. గత రెండు రోజుల నుండే తునికాకు సేకరణ కు వెళ్ళాలని, ఫారెస్ట్ అధికారులు, తునికాకు సేట్లు తెలిపారు. కానీ తునికాకు బోనస్ రాలేదని ఆకు పోయడానికి వెళ్లకుండా బందు చేశారు. దీంతో ఫారెస్ట్ అధికారులు ఎఫ్డిఓ వజ్రారెడ్డి, ఎఫ్ఆర్ఓ శ్రీరామ్ కుమార్, ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు కలిసి గురువారం లింగాల గ్రామపంచాయతీ పరిధిలోగల కొడిశల ఆదివాసి గ్రామానికి వెళ్లి, ఆదివాసీ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. బోనస్ డబ్బులు వేస్తాము కానీ, తునికాకు సేకరణకు అడవికి వెళ్ళండి అని తెలిపారు. ఆదివాసీ లు మాట్లాడుతూ లింగాల, బంధాల గ్రామాల ఆదివాసి మైన మాకు, తునికాకు సేకరణ రెండో పంటగా మాకు ఉపయోగపడుతుందని 2012, నుండి ఇప్పటివరకు 13 సంవత్సరాల బోనస్ డబ్బులు ఇప్పటి వరకు పడలేదు అన్నారు. మధ్యలో ఒకసారి 2017 లో కొందరికి పడ్డాయని, బంధాల గ్రామం లో అయితే ఇప్పటి వరకు పడలేదని ఆదివాసీ లు ఆందోళన చెందుతున్నారు. తునికాకు (బీడీ ఆకు) బోనస్ వెంటనే చెల్లించాలని లింగాల- బంధాల గ్రామాలఏజెన్సీ ఆదివాసీలు డిమాండ్ చేశారు. బోనస్ పడ్డాకనే తునికాకు వెళ్తామని కరాకండిగా చెప్పారు. తునికాకు అనేది రెండవ పంటగా భావించే ఆదివాసీలకు బోనస్ రాక నానా ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. బోనస్ మాకు వచ్చినంకనే తునికాకు (బీడీ ఆకు)  సేకరణకు అడవికి వెళ్తామని ఆదివాసీలు ఖరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. దీంతో ఫారెస్ట్ అధికారులు, తునికాకు సేట్లు చేసేదేమీ లేక వెనుదిరిగినట్లు సమాచారం. ఫారెస్ట్ అధికారులు ఆదివాసీల అకౌంట్ బుక్కుల ను సేకరించినట్లు తెలిసింది.  ఏది ఏమైనా తునికాకు బోనస్ ఇస్తేనే  (వస్తేనే) ఆకు సేకరిస్తామని ఆదివాసి కూలీలు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -