- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నేటి నుంచి హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు భారత్ సమ్మిట్ జరగనుంది. ‘డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్’ థీమ్‌తో జరిగే సదస్సులో హైదరాబాద్ డిక్లరేషన్ ఆమోదించడంతో పాటు ఒక తీర్మానం పాస్ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రైజింగ్ కాన్సెప్ట్‌ను ఈ వేదిక నుంచి ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రభుత్వం చూస్తోంది. ఉగ్రదాడి నేపథ్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు.