పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్న
ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం.జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈనెల 24న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో చిత్ర బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ‘రెండు సంవత్స రాల క్రితం ‘భీమ్లానాయక్’ విడుదలైనప్పుడు.. అన్ని సినిమాలకు వందల్లో ఉంటే, ఆ సినిమాకి 10, 20 రూపాయలు టికెట్ రేట్లు చేశారు. నేను అప్పుడు ఒక మాట చెప్పాను, ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అని. ఇది డబ్బు గురించి కాదు, రికార్డుల గురించి కాదు. మనం ధైర్యంగా నిలబడితే న్యాయం జరిగి తీరుతుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదు. నా దగ్గర ఆయుధాలు లేవు, గూండాలు లేరు.. గుండెల్లో ఉండే అభిమానులు తప్ప ఎవరూ లేరు. నేను సినీ పరిశ్రమకు వచ్చి 29 ఏళ్ళు. కొంచెం వయసు పెరిగిందేమో కానీ, గుండెల్లో చావ ఇంకా బతికే ఉంది. వరుస హిట్స్ ఇచ్చిన నేను.. ‘జానీ’తో పరాజయం చూశాను. ఆ సమయంలో అర్థమైంది.. ఇక్కడ బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని. క్రిష్ ఈ సినిమాకి పునాది వేశారు. కీరవాణి సంగీతం లేకుండా ఈ సినిమా లేదు. జ్యోతి కృష్ణ ఈ సినిమాని బాగా హ్యాండిల్ చేశారు. తండ్రికి ఉన్న విజన్‌కి కొడుకు సారధ్యం వహించారు. తండ్రీ కొడుకుల ఎఫర్ట్ ఈ సినిమా. మన భారతదేశం ఎవరి మీద దాడి చేయ లేదు, ఎవరినీ ఆక్రమించుకోలేదు. మనం చదువుకున్న పుస్తకాల్లో మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప.. వారి అరాచకాన్ని చెప్పలేదు. ఔరంగజేబు సమయంలో నువ్వు హిందువుగా బ్రతకాలంటే టాక్స్ కట్టాలి అన్నారు. అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ ప్రజల పక్షాన నిలబడ్డారు. ఇలాంటి నేపథ్యంలో వీరమల్లు అనే కల్పిత పాత్రతో ఒక సగటు మనిషి ఏం చేసి ఉండొచ్చు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నాం’ అని చెప్పారు.
ప్రజల కోసం ‘వీరమల్లు..’ పోరాటం
- Advertisement -
- Advertisement -