న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత మొత్తం ఎగుమతులు 6.01 శాతం పెరిగి 824.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.69 లక్షల కోట్లు)తో ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంతక్రితం ఏడాదిలో 778.1 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. 2024-25లో సర్వీసు ఎగుమతులు 13.6 శాతం పెరిగి 387.5 బిలియన్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం యేతర సరుకుల ఎగుమతులు 6 శాతం పెరిగి 374.1 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి. కాగా.. 2024-25లో సరుకుల ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటంతో 282.82 బిలియన్లకు పెరిగాయి. ఇంతక్రితం ఏడాది ఈ లోటు 241.14 బిలియన్లుగా నమోదయ్యింది.
- Advertisement -