నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ జీహెచ్ఎంసీ () ప్రధాన కార్యాలయంలో సరిగ్గా ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ నెల 23న పోలింగ్ జరగ్గా 112 మంది ఓటర్లకు గాను మొత్తం 88 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 78.57 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. అయితే, పోటీలో మజ్లిస్ అభ్యర్థిగా మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ (), బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు బరిలో నిలిచారు. అయితే మరో 2 గంటల్లో తుది ఫలితం వెవువడే అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. కౌంటింగ్ సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం చుట్టూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
మొదలైన ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్..
- Advertisement -
RELATED ARTICLES