Tuesday, July 15, 2025
E-PAPER
Homeజిల్లాలువర్షాల కోసం అన్నదాతల ఎదురుచూపు

వర్షాల కోసం అన్నదాతల ఎదురుచూపు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : జూన్ మాసంలో వర్షాలు కురవడం లేదని రైతన్నలు ఆకాశం వైపు ఎదరురు చూస్తున్నారు. ఇక్కడ సాగునీటి సౌకర్యాలు లేవు. వర్షాధారం పైనే ఆధారపడి మొదట పంటల సాగు, ఆ తర్వాత రబ్బీ పంటల సాగు చేస్తారు. వానలు పడకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని వ్యవసాయదారులు ఆందోళన చెందుతున్నారు. పంటలు వేసిన తర్వాత 15 రోజులుగా వర్షం రావడం లేదు.

ఈ మండలంలో అత్యధికంగా సోయా పంట సాగు చేశారు. ఈ పంటతో పాటు పత్తి, పెసర, మినుము, కంది తదితర పంటలు వేశారు. ఈ పంటల ఎదుగుదలకు వర్షాలు తప్పనిసరగా అవసరం. మంగళవారం జరుపుకున్న బోనాల పండగ సందర్బంగా వర్షాలు బాగా కురవాలని వ్యవసాయ దారులు కోరుకున్నారు. తద్వారా ప్రజలు సుఖసంతోషాలతో జీవించే విధంగా చూడాలని గ్రామ దేవతలకు బోనాలు, నైవేద్యాలతో మొక్కులు తీర్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -