Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుసీఎంతో టీపీసీసీ చీఫ్‌ భేటీ

సీఎంతో టీపీసీసీ చీఫ్‌ భేటీ

- Advertisement -

తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సీఎం రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ భేటీ అయ్యారు. సోమవారం వీరిద్దరి మధ్య గంటన్నరకుపైగా సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ పథకాలను విస్తతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో పీసీసీ, పీఏసీ భేటీ ఉండే అవకాశం ఉండడంతో ఈ సమావేశంలో మెజారిటీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా 42శాతం బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నారు. బోర్డు, కార్పొరేషన్‌ డైరెక్టర్ల పోస్టుల నియామకాలు త్వరగా చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. జనహిత పాదయాత్రలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కారాలపై నేతలు చర్చించినట్టు సమాచారం.
అరెస్టులు అక్రమం…అప్రజాస్వామికం : మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీల అరెస్ట్‌ అక్రమం, అప్రజాస్వామిక చర్య అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. ఓట్ల చోరీపై ఆధారాలతో సహా నిరూపించి దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలను ప్రధాని మోడీ సర్కారు ఢిల్లీలో అరెస్ట్‌ చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సంఘాన్ని కలిసి ఓట్ల చోరీపై వినతి పత్రం ఇస్తామని శాంతి యుతంగా వెళ్తున్న ఎంపీలను అరెస్ట్‌ చేయడం అక్రమమనీ, అప్రజాస్వామ్యమని ఆయన అన్నారు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేసి ఓట్‌ చోరీ పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img