Friday, March 27, 2026
E-PAPER

100% వినోదం

- Advertisement -

జీ స్టూడియోస్‌ సమర్పణలో నిహారిక తన పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఉమేష్‌ కుమార్‌ బన్సాల్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌, నయన్‌ సారిక జంటగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 3న రిలీజ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో మదనపల్లిలోని ఎంఐటీఎస్‌ కాలేజ్‌లో మేకర్స్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. లక్ష్మీ నరసింహ మూవీస్‌ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ చాలా బావుంది. దీని కంటే పది రెట్లు అలరించేలా రేపు సినిమా ఉండబోతోంది. కామెడీ, ఫాంటసీ ఎలిమెంట్స్‌ అన్నీ అలరిస్తాయి. ఈ సినిమాను రిలీజ్‌ చేసే అవకాశం ఇచ్చిన మన్యం రమేష్‌కి, నిహారిక కొణిదెలకి థ్యాంక్స్‌’ అని అన్నారు.

‘ప్రేక్షకులను మెప్పించే అంశాలన్ని ఈ సినిమాలో ఉంటాయి’ అని గెటప్‌ శ్రీను చెప్పారు. హీరోయిన్‌ నయన్‌ సారిక మాట్లాడుతూ, ‘అందరికీ ట్రైలర్‌ నచ్చే ఉంటుంది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు. హీరో సంగీత్‌ శోభన్‌ మాట్లాడుతూ, ‘ట్రైలర్‌లో ఏదైతే ఫన్‌, ఫాంటసీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ని చూసి అందరూ ఎంజారు చేస్తున్నారో.. అంత కంటే వంద రెట్లు సినిమాలో ఉంటుంది. నాది గ్యారంటీ. నా సినిమాలో ఎప్పుడు మెసేజ్‌లు ఉండవు. కేవలం వినోదం మాత్రమే ఉంటుంది. ఇందులో 100 పర్సెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కా’ అని చెప్పారు. నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ, ‘ఇప్పటి వరకు రిలీజ్‌ చేసిన టీజర్‌, సాంగ్స్‌, లేటెస్ట్‌గా వచ్చిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సమ్మర్‌లో అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ ఇది’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -