- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని నాచారం గ్రామానికి చెందిన మహిళ రొక్కల వెన్నెల సోమవారం 108 వాహనంలో ప్రసవించింది. ఉదయం పురిటి నోప్పులు రావడంతో ఆమెను 108 వాహనంలో నాచారం నుండి భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గం మధ్యలో పురిటినొప్పులు అధికమవడంతో వాహనాన్ని నిలిపి ఆశ కార్యకర్త సాయంతో ఈఎంటి సుజాత ప్రసవ సేవలు చేశారు. నార్మల్ డెలివరీ అయినట్లు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లుగా 108 పైలట్ జీవన్ రెడ్డి తెలిపారు.
- Advertisement -



