– రోడ్డు ప్రమాద బాధితుడు వద్ద లభించిన రూ.లక్ష అందజేత
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి వద్ద లభించిన నగదును అప్పగించి 158 సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన అబ్దుల్ మొజీన్ అనే వ్యక్తి వ్యాపారం నిమిత్తం రూ. లక్ష నగదు తీసుకొని టాటా ఏస్ వాహనంలో నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ వెళ్తున్నాడు. మార్గమధ్యంలో వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామ సమీపంలో టాటా ఏస్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అబ్దుల్ మొజీన్ కుడి కాలుకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడ్డ అబ్దుల్ మొజీన్ కు ప్రథమ చికిత్స అందించారు.
మెరుగైన వైద్యం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అబ్దుల్ మొజీన్ ను అంబులెన్స్ లో తరలిస్తుండగా అతని వద్ద లభించిన రూ. లక్ష నగదును కమ్మర్ పల్లి అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి సుంకరి విజయ్ కుమార్, పైలెట్ రమేష్ బాధితుల సమక్షంలో ఆస్పత్రి వైద్యులకు అందజేశారు. విధి నిర్వహణలో చిత్తశుద్ధితో సేవలందిస్తూ, గాయపడ్డ వ్యక్తి వద్ద లభించిన నగదును అప్పగించి నిజాయితీ చాటుకున్న కమ్మర్ పల్లి 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి సుంకరి విజయ్ కుమార్, పైలెట్ రమేష్ ను పలువురు అభినందించారు.
నిజాయితీని చాటుకున్న 108 సిబ్బంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES