జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్
నవతెలంగాణ – ధర్మసాగర్
108 సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని,ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించాలని జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో హనుమకొండ అత్యవసర వాహనాల 108 జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ ధర్మసాగర్ మండల కేంద్రంలో అంబులెన్స్ లో అధునాతనమైన వైద్య పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి మరియు అత్యవసర మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అని తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. ప్రజలకు నాణ్యమైన అత్యవసర వైద్య సేవలు చేయాలని సూచించారు. అత్యధిక టెక్నాలజీతో 108 సర్వీస్కు నడుస్తుందని,దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రజలు చలికాలంలో సంభవించే వ్యాధులనుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎలాంటి ప్రమాదాలు జరిగిన వెంటనే 108 కి కాల్ చేసి అత్యవసర వైద్య సేవలు పొందాలని సూచించారు.
108 కి కాల్ రాగానే 30 సెకండ్లలో బయలుదేరి మెరుగైన ప్రాథమిక చికిత్స చేసుకుంటూ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ కు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.108 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మరియు గత జనవరి నుండి అక్టోబర్ వరకు 1108 ప్రాణాలు కాపాడినందుకు 108 సిబ్బందిని అభినందించారు .ఇంకా ఎక్కువమందికి అత్యవసర సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.ధర్మసాగర్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు 108 సర్వీస్ 102 సర్వీసు, అత్యవసర పశువుల కోసం రైతులు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు1962 సేవలు వాడుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సుధా ,నాగేశ్వరరావు , పైలెట్స్ చిత్తనూరి ప్రవీణ్ కుమార్, కొట్టే సుధాకర్ ,సునీల్ ,మాచర్ల వెంకటేష్ పాల్గొన్నారు.



