అందులో ఎనిమిది కొత్త బిల్లులే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ ముందుకు 13 బిల్లులు ఆమోదం కోసం రానున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ ముందుకు రానున్న బిల్లుల జాబితాను రాజ్యసభ సెక్రెటేరియట్ విడుదల చేసింది. 13 బిల్లుల్లో ఎనిమిది బిల్లులు కొత్తవి కాగా, ఇప్పటికే లోక్‌సభ ఆమోదించిన బిల్లులు మూడు ఉన్నాయి. అలాగే ఇప్పటికే లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లులు మూడు ఉన్నాయి. లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభ ముందుకు 13 బిల్లులు రాజ్యసభలో ఆమోదం కోసం సరుకు రవాణా బిల్లులు, సముద్రం ద్వారా వస్తువులను రవాణా చేసే బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లులను జాబితా చేశారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన గోవా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆదాయపు పన్నుబిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం కోసం జాబితా చేశారు.
కొత్త బిల్లులు
1. మణిపూర్ వస్తువులు, సేవల పన్ను సవరణ బిల్లు
2. జన్ విశ్వాస్ నిబంధనల సరవణ బిల్లు
3. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సరవణ బిల్లు
4. పన్ను చట్టాల సవరణ బిల్లు
5. జియోహెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్ సంరక్షణ, నిర్వహణ బిల్లు
6. గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ సవరణ బిల్లు
7. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు
8. జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లు
రాజ్యసభ ముందుకు 13 బిల్లులు
- Advertisement -
- Advertisement -