దేశవ్యాప్తంగా లాకప్‌డెత్‌లు
తెలంగాణలోనూ ఏడు..
న్యూఢిల్లీ : జనవరి 1 నుంచి మార్చి 15 వరకు 74 రోజుల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 170 కస్టడీ మరణాలు సంభవించాయని మంగళవారం పార్లమెంటుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. 2021 నుంచి 2026 వరకు రాష్ట్రాలవారీగా కస్టడీ మరణాల వివరాలను పరిశీలిస్తే.. గత సంవత్సరంతో పోలిస్తే కస్టడీ మరణాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను చూపిస్తుంది. 2024-25 : 140, 2023-24 : 157, 2022-23 : 163, 2021-22 : 176 కస్టడీ కేసులు నమోదయ్యాయి. బీహార్‌లో ఈ ఏడాదిలో 19 కేసులు, రాజస్థాన్ 18, ఉత్తరప్రదేశ్‌లో 15 కస్టడీ మరణాలు నమోదయ్యాయి. ఇక వీటి వరుసలో పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రలో 14 కేసులు నమదయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడులో 7, తెలంగాణ : 5, కర్నాటక : 3, కేరళ : 3, పశ్చిమ బెంగాల్ : 7, ఒడిశా : 9, అసోం : 5, అరుణాచల్‌ప్రదేశ్ :3 కస్టడీ మరణాలు నమోదయ్యాయి. మిజోరాం, సిక్కిం, లడఖ్లలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇక ఢిల్లీలో నాలుగు కస్టడీ మరణాలు నమోదయ్యాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలాంటి మరణాలు నమోదుకాలేదు. అండమాన్ అండ్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయైంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నుంచి రాష్ట్రాల వారీగా అందిన సమాచారం మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంహెచ్ఏ) పార్లమెంటుకు తెలిపింది. అయితే ఈ డేటాను పరిశీలిస్తే గతేడాది కంటే ఈ ఏడాది కస్టడీ మరణాలు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది.
74 రోజుల్లో 170 కస్టడీ మరణాలు
- Advertisement -
- Advertisement -



