నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్ (ఎంసెట్)కు 2,20,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ మేరకు ఎప్‌సెట్ కన్వీనర్ కె విజరుకుమార్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,55,804 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 64,866 మంది, రెండింటికీ 209 మంది కలిపి మొత్తం 2,20,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తుల సమర్పణ గడువు వచ్చేనెల నాలుగో తేదీ వరకు ఉందని తెలిపారు. ఆలస్య రుసుంతో మే రెండో తేదీ వరకు దరఖాస్తులను సమర్పించొచ్చని సూచించారు. మే నాలుగు, ఐదు తేదీల్లో ఎప్‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలు, అదేనెల తొమ్మిది నుంచి 11వ తేదీ వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఇతర వివ రాల కోసం ష్ట్ర్‌్‌జూర://వaజూషవ్.్‌స్త్రషష్ట్రవ.aష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదిం చాలని సూచించారు.
ఎప్‌సెట్‌కు 2.20 లక్షల దరఖాస్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



