నవతెలంగాణ – కామారెడ్డి
సమాచార హక్కు చట్టం 2005 ఇది ఒక వజ్రాయుధం ఈ చట్టం 12 అక్టోబర్ 2005న భారత పార్లమెంట్లో అమలైంది అంటే 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్ 3, 2025 నుండి 12 అక్టోబర్ 2025 వరకు వివిధ జిల్లాలో, ఆయా మండల కేంద్రాలలో, గ్రామాలలో, తండాలలో ఘనంగా నిర్వహించడం జరిగిందని రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి రోజుల్లో ప్రతి పౌరుడు చట్టాల గురించి తెలుసుకోవాలని అవసరం ఉన్నది అన్నారు. భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులలో సమాచార హక్కు చట్టం కూడా ముఖ్యమైన చట్టమని తెలియజేస్తూ ప్రతి మహిళ, ప్రతి పౌరుడు ఈ చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో ఈరోజు 20 వార్షిక వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కోసి రాష్ట్ర డైరెక్టర్ సలీంకు తినిపించి, యాక్టివిస్టులు, ప్రతినిధులు ఒకరిని ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి మీడియా ఇంచార్జ్ సయ్యద్ జావిద్, జిల్లా అధ్యక్షులు శివపూజ లింబయ్య, ఉపాధ్యక్షులు ఎంవి భాస్కర్, మహిళా అధ్యక్షురాలు న్యాయవాది ఏజిపి షబానా బేగం, మహిళ కార్యదర్శి షర్ట్, తెలంగాణ జోనల్ అధ్యక్షులు ప్రదీప్ కుమార్, ప్రతినిధులు, కామారెడ్డి జిల్లా సలహాదారులు రాజేశ్వర్, అన్వర్ గౌరీ,పంతులు రవి, మొహమ్మద్, తాహెర్ తదితరులు పాల్గొన్నారు.