- Advertisement -
హైదరాబాద్ : జాతీయ సబ్ జూనియర్ (అండర్-14) ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు తెలంగాణ నుంచి 24 మంది ఫెన్సర్లు అర్హత సాధించారు. మాదాపూర్‌లోని డెక్కన్ ఫెన్సింగ్ క్లబ్‌లో రెండు రోజులు పాటు జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 83 మంది ఫెన్సర్లు హాజరయ్యారు. ట్రయల్స్‌లో ప్రతిభ చాటిన 24 మంది ఫెన్సర్లు నవంబర్ 3 నుంచి మణిపూర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణకు ప్రాతినిథ్యం వహిస్తారు. ఈ మేరకు తెలంగాణ ఫెన్సింగ్ సంఘం (టీఎఫ్‌ఏ) అధ్యక్షురాలు గుత్తా జ్వాల, కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.
- Advertisement -



