Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుమండలంలో 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులు

మండలంలో 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 27 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినట్లు ఎంఈఓ తిరుపతయ్య తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. అనంతరం వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ తిరుపతయ్య మాట్లాడుతూ.. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారిపై బాధ్యత ఎక్కువగా ఉంటుందని అన్నారు. దీంతో మరింత కష్టపడి విద్యార్థులకు విద్యా బుద్దులు శ్రద్ధగా చెప్పాలన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కాని ఉపాధ్యాయులు నిరాశ చెందవద్దని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులంతా పేద మధ్యతరగతికి చెందినవారు ఉంటారని అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. అందుకని వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రయివేటు పాఠశాలల్లో చదువు కంటే ప్రభుత్వ పాఠశాలల్లోని బాగుందని రీతిలో చదువులు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి తల్లిదండ్రుల కంటే గొప్పదని వారికి విద్యబుద్దులతో పాటు క్రమశిక్షణ నేర్పడం చాలా ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పి జి హెచ్ ఎం లు లాలయ్య, కోమటిరెడ్డి హన్మంత రెడ్డి, విజయేంద్ర ఉపాధ్యాయులు పల్లెవార్ మారుతి, శ్రీనివాస్, బాబు, గోపాల్ ,ఎమ్మార్సీలు విజయ ప్రకాష్ ,మాధప్ప, భీమ్రావు, మొగులప్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad