- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ఎస్సికాలనికి వేళ్ళు ప్రధాన రహదారి రేపాల శ్రీను ఇంటి నుంచి జిల్లా పరిషత్ పాత హైస్కూల్ వరకు రూ.15 లక్షల జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులతో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాని కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు సోమవారం సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లుగా సర్పంచ్ బండి స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్,మాజీ సర్పంచ్ అశోక్ రావు, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజుగౌడ్, వార్డు సబ్యుడు ఇందారపు చెంద్రయ్య, కాగ్రెస్ నాయకులు ఆకుల శ్రీనివాస్, కుంట సది, బూడిద సాగర్, సమ్మయ్య, సిద్దు పాల్గొన్నారు.
- Advertisement -



