నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఇచ్చోడలోని మహాత్మ జ్యోతిబా పూలే స్కూల్, కళాశాల (బాలుర)లో అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని టీజీవిపి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కోరారు. సోమవారం ప్రజావాణిలో ఈ విషయమై అదనపు కలెక్టర్ కు వినతి అందజేశారు. గత ఫిబ్రవరి 18న ఫేర్వెల్ పార్టీ పేరిట స్కూల్ ఉద్యోగులు 500 నుండి 1000 మొత్తం ఒక లక్ష 25 వేల వరకు పిల్లలనుండి అక్రమంగా డబ్బులను వసూలు చేశారని ఆరోపించారు. అదేవిధంగా జనవరి నెలలో సంక్రాంతి పండగ సందర్భంలో విద్యార్థులు లేటుగా వచ్చారని డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.
అలాగే అక్కడ పనిచేస్తున్న కొంతమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సరైన ఉద్యోగానికి క్వాలిఫైడ్ సర్టిఫికెట్లు లేకుండా నకిలీ ధ్రువపత్రాలతో ఫోర్జరీ చేసి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉద్యోగాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఉమ్మడి జిల్లా ఆర్.సీఓ జిల్లా కేంద్రంలో ఉండకుండా పర్యవేక్షణ చేయకుండా ప్రభుత్వం ద్వారా వచ్చే అలవెన్స్లను దుర్వినియోగం చేస్తూ తప్పుడు బిల్లులను తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతు.. పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్ ఆరోపించారు. అక్రమ వసూలు చేసిన ఆర్సిఓ, ప్రిన్సిపల్, హౌస్ మాస్టర్లపై, నకిలీ ధృవ పత్రాలతో ఉద్యోగులుగా కొనసాగుతున్న వీరందరిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.



