కొల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశలో దాదాపు 3.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించకోనున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ తాజాగా వెల్లడించింది. వీరిలో 1.84 కోట్ల మంది పురుషులు, 1.75 కోట్ల మంది మహిళలు, 465 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. ఈ నెల 23న 16 జిల్లాల్లో తొలి దశ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. జిల్లాల పరంగా ముర్షిదాబాద్‌లో అత్యధికంగా 50.26 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. తరువాత పుర్బా మెదినిపూర్‌లో 41.60 లక్షల మంది, పశ్చిమ మెదినిపూర్‌లో 37.70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక కలింపూంగ్ జిల్లాలో అతి తక్కువగా 2.01 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. బెంగాల్‌లో తొలి దశలో 152 అసెంబ్లీ స్థానాలకు, ఈ నెల 29న రెండో దశలో 142 స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పరిశీలన, వెరిఫికేషన్ తరువాత ఓటర్ల జాబితాలను ఆప్‌డేట్ చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రెట్టింపు అభివృద్ధి : ప్రధాని మోడీ
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో పశ్చిమ బెంగాల్ రెట్టింపు అభివృద్దిని చవిచూడనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. కాబట్టి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం బెంగాల్ ప్రజలు బిజెపికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం సిలిగురిలోని కవాఖలి మైదానంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఈశాన్యప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న సిలిగురి కారిడార్‌ను భారీ స్థాయిలో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సిలిగురి కారిడార్‌ను విభజిస్తామని బెదిరించిన వారికి టిఎంసి మద్దతు ఇస్తుందని మోడీ విమర్శించారు. అలాగే, ఆదివారం బంకురా జిల్లాలోని సోనాముఖిలో బిజెపి తరుపున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బెంగాల్‌ను మూడు ముక్కలు చేయడాని బీజేపీ కుట్రలు : మమతా బెనర్జీ
బెంగాల్‌ను మూడు ముక్కలు చేయడాని బీజేపీ డిలిమిటేషన్ బిలు తీసుకొస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్‌లోని కొన్ని భాగాలను బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో విలీనం చేసి తరువాత అక్కడ ఉన్న బెంగాలీయలను హింసించే అవకాశం ఉందని మమతా విమర్శించారు.
బెంగాల్ తొలి దశలో 3.6 కోట్ల మంది ఓటర్లు
- Advertisement -
- Advertisement -



