Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలు3 నెలల బియ్యం.. ప్రజల తీవ్ర ఇబ్బందులు

3 నెలల బియ్యం.. ప్రజల తీవ్ర ఇబ్బందులు

- Advertisement -

రేషన్ షాప్ ల వద్ద ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: బియ్యం కొరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రేషన్ షాప్ ల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రేషన్ షాప్ వద్ద ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుపేదలకు రేషన్ షాపుల ద్వారా బియ్యం 3 నెలలవి పంపిణీ చేయడంతో, పేదలు కూలి మానుకొని రోజుల తరబడి రేషన్ షాపుల దగ్గర పడిగాపులు కాస్తున్నారని అన్నారు. ప్రధానంగా ఒక్కొక్కరికి సర్వర్ ప్రాబ్లంతో గంటల తరబడి సమయం తీసుకుంటున్నదని తెలిపారు. దీనికి ప్రధాన కారణం ప్రతి ఒక్కరూ 6 సార్లు ఫింగర్ ప్రింట్స్ ఇవ్వటం జరుగుతుంది. వాటికి సమయం ఎక్కువ పడుతుందని అన్నారు. ప్రజలు గంటల తరబడి ఎదురుచూసినా.. చివరకు అందరికీ దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొన్ని సందర్భాలలో ఆన్లైన్ పనిచేయకపోవడం ఫలితంగా క్యూ లైన్లు పెరుగుతూ.. పిల్లలు, వృద్ధులు గంటల తరబడి నిలబడుతున్నారని, దీనివల్ల వారు అస్వస్థతకు గురవుతున్నారి అన్నారు. మూడు నెలలవి ఒకేసారి ఫింగర్ ప్రింట్ తీసుకొని రేషన్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు రేషన్ డీలర్లు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని  డిమాండ్ చేశారు. ఈ నెల చివరి వరకు రేషన్ ఇచ్చే విధంగా చూడాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో భూమేష్, గంగాధర్, హైమద్ నిర్మల షాజహా తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img