వెల్లడించిన క్యూబా
హవానా : వెనిజులాపై అమెరికా జరిపిన సైనిక చర్యలో తమ దేశానికి చెందిన 32 మంది అధికారులు చనిపోయారని క్యూబా తెలిపింది. వెనిజులా ప్రభుత్వ అభ్యర్థన మేరకు క్యూబాకు చెందిన సైనిక, పోలీసు అధికారులు అక్కడికి వెళ్లారు. క్యూబా అధికారులు ఏ పని మీద వెనిజులాలో ఉన్నారో స్పష్టంగా తెలియడం లేదు. అయితే వెనిజులాలో వివిధ కార్యకలాపాలలో సహకరించే నిమిత్తం క్యూబా అధికారులు అనేక సంవత్సరాలుగా అక్కడికి వెళుతున్నారు. ‘దాడిలో అనేక మంది క్యూబన్లు చనిపోయారు’ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ధృవీకరించారు. కాగా చనిపోయిన అధికారుల కోసం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నామని క్యూబా తెలిపింది. మృతుల కుటుంబాలకు మాజీ అధ్యక్షుడు, రివల్యూషనరీ నేత రాల్ కాస్ట్రో, అధ్యక్షుడు మిగుయెల్ డయాజ్-కానెల్ సంతాపం తెలియజేశారు.



