- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డోంగ్లీ మండలంలో పంట నష్ట సర్వే కొనసాగుతోందని డోంగ్లీ మండల వ్యవసాయ అధికారి శివకుమార్ తెలిపారు. ఇప్పటికీ సుమారుగా 3,200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ఈ సందర్బంగా వారు తెలిపారు. అదేవిధంగా ఏఈవోలతో పంట నష్టం గురించి క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగుతున్నట్లు మండల ఏవో శివకుమార్ వివరించారు.
- Advertisement -