మావోయిస్టు అగ్రనేత పాపారావు సరెండర్!
అనుచరులతో కలిసి బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగుబాటు
నవతెలంగాణ-మహదేవపూర్
కేంద్రం పెట్టిన మార్చి 31 గడువుకు ముందే కీలక అగ్రనేత తన అనుచరులతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తోంది. సీపీఐ మావోయిస్టు పార్టీ అత్యంత కీలక నేత, డివిజనల్ కమిటీ కమాండర్, పాపారావు అలియాస్ మంగుదాదా అలియాస్ చంద్రన్న అలియాస్ సునాం చంద్రన్న పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనతోపాటు ఏసీఎం కొర్రం మనీష, ఏసీఎం పర్చాపి మంగేష్, సీవైపీసీఎం కమాండర్ కేశా సోఢి, పరాతాపూర్ ఏసీఎం చందర్ కట్లం, పరాతాపూర్ ఏసీఎం రూపి, దక్షిణ బస్తర్డి విజన్ మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ విజ్జా హేమలా కూడా ఉన్నారని సమాచారం. మొత్తం 17 మంది అనుచరులతో కలిసి బీజాపూర్ ఎస్పీ ఎదుట సరెండర్ అయ్యారని సమాచారం. రెండు దశాబ్దాలుగా ఇంద్రావతి-అబుజ్‌మడ్ అటవీ ప్రాంతం కేంద్రంగా పాపారావు తన కార్యకలాపాలను సాగించారు. గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరిన వ్యక్తుల్లో మడావి హిడ్మా, బార్సే దేవా తర్వాత పాపారావు కూడా ఒకరు. పలుమార్లు ఎన్‌కౌంటర్ల నుంచి తృటిలో తప్పించుకున్నారు
ఒత్తిడితోనే సరెండర్ వైపు..
ఈ నెల 31కల్లా దేశంలో మావోయిస్టులను అంతమొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టి ‘ఆపరేషన్ కగార్’ తుది దశకు చేరింది. వారం రోజులుగా దక్షిణ బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లను అత్యంత వేగంగా ముమ్మరం చేశాయి. అడవులను జల్లెడ పట్టడం, సమాచార వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో పాపారావు వ్యక్తిగత నెట్‌వర్క్ పూర్తిగా బలహీనపడినట్టుగా తెలుస్తోంది. దానికితోడు అధికారుల నుంచి పెరిగిన ఒత్తిడి కారణంగా ఆయన అజ్ఞాతాన్ని వీడాలని నిర్ణయించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ జర్నలిస్టు ద్వారా అధికారులను సంప్రదించి సరెండర్ ప్రక్రియను పూర్తి చేసినట్టు సమాచారం. కాగా, బస్తర్ ప్రాంతంలో చివరి అగ్రనేత పాపారావు లొంగిపోవడం వల్ల దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి నామమాత్రంగా మారే అవకాశం ఉందని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.
35 ఏండ్ల అజ్ఞాతవాసానికి తెర..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



