సినిమా మేకింగ్‌కి సంబంధించి సరికొత్త సాంకేతికత, సజనాత్మకత, కొత్త ఆవిష్కరణలకు సినిమాటికా ఎక్స్‌పో వేదికగా నిలిచింది. హైదరాబాద్ నోవాటెల్ హెచ్‌ఐసిసిలో నవంబర్1,2 తేదీలలో సినిమాటికా ఎక్స్‌పో 3వ ఎడిషన్‌ని ఘనంగా ప్రారంభించబోతున్నారు. సినిక క్రియేటర్స్ కౌన్సిల్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో, ఇండియాజారు సహకారంతో సినిమాటోగ్రాఫర్ పి.జి.విందా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’గత సంవత్సరం వేలాది మంది బ్లాగర్స్, కంటెంట్ క్రియేటర్స్, ఇన్ఫ్లూయెన్సర్స్ అలాగే ఫిల్మ్ మేకర్స్, షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ఫిల్మ్ స్కూల్స్ స్టూడెంట్స్ మొత్తం కలిపి 40 వేలకు పైగా ఔత్సాహికులు ఈ వేదికపై కనెక్ట్ అయ్యారు. తెలుగు పరిశ్రమ నుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. హైదరాబాద్‌లో మొదలైన ఈవెంట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈవెంట్‌గా మారింది. ఇది ఇంతలా విస్తరించడానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ కూడా. ఇక ఫిల్మ్ మేకింగ్ అంటే కేవలం కొందరికే కాకుండా ఆసక్తి ఉన్నవారందరికీ అందుబాటులో ఉండాలి.
గ్రామాల్లో ఉన్న క్రియేటర్ల కోసం సినిమాటికా ఎక్స్‌పో అద్భుతమైన వేదికగా నిలుస్తుంది. సినిక ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ. ఈ వర్టికల్ ఫిల్మ్ మేకింగ్‌లో, క్రియేటివ్ ఆర్ట్స్‌లో అన్నింటిని, అలాగే అన్ని విభాగాలకు సమాచారం, సదుపాయాలు అందించడానికి ఈ సినిక క్రియేటర్స్ కౌన్సిల్ ముందుంటుంది. సినిమాటికా ఎక్స్‌పోలో వచ్చే సంవత్సరం ఫిల్మ్ కార్నివాల్‌ను నిర్వహించబోతున్నాం. ప్రపంచ సినిమాలను సైతం ఇక్కడ వీక్షించవచ్చు. టెక్నికల్ డిపార్ట్‌మెంట్, వీఎఫ్‌ఎక్స్, ఎడిటర్స్, డైరెక్టర్స్ ప్రసంగాలు ఈ ఎక్స్‌పో ఉంటాయి. వాటి ద్వారా నూతన ఫిల్మ్ మేకర్స్ ఎంతో నేర్చుకోవచ్చు. ఈ సంవత్సరం సినిమాటికా ఎక్స్‌పోలో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. అలాగే నిపుణులతో ‘ఏఐ’ సెషన్స్ ఉంటాయి’ అని తెలిపారు. ‘సినిమాటికా ఎక్స్‌పో, సినిక క్రియేటర్ కౌన్సిల్ మద్దతుతో భవిష్యత్తులో ఫిల్మ్ మేకింగ్‌కి సంబంధించిన కెమెరాలు, సాఫ్ట్‌వేర్స్ అన్ని హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉంటాయి’ అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంజా శ్రవణ్ చెప్పారు.
ఘనంగా సినిమాటికా ఎక్స్‌పో 3వ ఎడిషన్
- Advertisement -
- Advertisement -



