Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్42% బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలి 

42% బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలి 

- Advertisement -

బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

బిసిలకు 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు)బిఎల్ పి రాష్ట్ర కమిటి పిలుపు మేరకు సోమవారం బిఎల్ పి జిల్లా కమిటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందజేశారు. అంతకు ముందు ధర్నా చౌక్ లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు) బిఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 2025లో బిసి కులాల ప్రజలకు విద్య,ఉద్యోగ, స్థానిక సంస్థల్లో42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులను ఆమోదించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ లకు పంపి7 నెలల అవుతున్న కేంద్ర ప్రభుత్వం వద్ద గత 7 నెలలుగా పెండింగ్ లోనే ఉన్నదన్నారు.

ఈ నేపథ్యంలో  రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిసి బిల్లులను 9వ షెడ్యూల్ లో చేర్చందకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని  కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, బహుజన లెఫ్ట్ పార్టీ- బిఎల్ పి రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ లకు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పలు డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని పంపాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వద్ద 7 నెలలుగా పెండింగ్ లో 42% బిసి కులాల ప్రజలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చి పార్లమెంట్ లో చట్టం చేయాలి.

42% బిసి కులాల రిజర్వేషన్లలో  ఏ.బి.సి.డి,ఈ వర్గీకరణతో చట్టం చేయాలి. కామారెడ్డి బిసి డిక్లరేషన్ ప్రకారం సంవత్సరానికి రూ 20 వేల కోట్ల బిసి కులాల ప్రజల విద్య ఉద్యోగ ఉపాధి కోసం రెండు సంవత్సరాలకుగానూ వెంటనే రూ.40,000 వేల కోట్లు విడుదల చేయాలి. రాష్ట్రంలోని నిర్మాణ రంగం తోపాటు అన్ని రకాల ప్రభుత్వ కాంట్రాక్టులలో బిసి కులాల ప్రజలకు వర్గీకరణతో కూడిన 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పదవుల్లో 90% బిసి,ఎస్సీ, ఎస్టీల తోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాటల అనిల్ కుమార్, బోధన్ డివిజన్ కన్వీనర్ డి. పోలిశెట్టి, జిల్లా నాయకులు చంద్రా గౌడ్, బిసి కులాల నగర నాయకులు జె.సత్యనారయణ, కె.సుభాష్, బి. గోపాల్, బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -