Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ముగిసిన 44 రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ క్రీడలు 

ఘనంగా ముగిసిన 44 రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ క్రీడలు 

- Advertisement -

44 మంది క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపిక 
షూటింగ్ బాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య 
నవతెలంగాణ – నెల్లికుదురు

గత మూడు రోజులుగా నెల్లికుదురు స్థానిక ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 44వ రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు ముగిసినట్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య తెలిపారు. షూటింగ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జనరల్ శ్రీ జిత్రాజ్ తోమర్ రాష్ట్ర అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాలం రజిత 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుమారు 60 మంది టెక్నికల్ అఫీషియల్సు 800 మంది క్రీడాకారులు ఈ యొక్క పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జరిగినటువంటి ఈ యొక్క పోటీలలో క్రీడాకారులు తమ అత్యుత్తమ మైనటువంటి ప్రతిభను కనబరిచి క్రింది విధంగా బహుమతులు ప్రధానం జరిగింది. షూటింగ్ బాల్ అనే క్రీడకు భారతదేశంలో అన్ని సెంట్రల్ ఉన్నటువంటి డిపార్టుమెంటులో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క క్రీడను తెలంగాణ రాష్ట్రంలో ఇంప్రూవ్మెంట్ చేసినట్లయితే తెలంగాణ క్రీడాకారులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. 

 గెలుపోటములు సహజమని ప్రతి ఒక్క క్రీడాకారుడు ప్రతిభ అను ఆధారంగా చేసుకొని గెలుపు ఓటలను సమానస్ఫూర్తితో తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ పోటీలలో సుమారు 24 మంది క్రీడాకారులను ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో నవంబర్లో జరుగు క్రీడలకు పంపుతారని తెలిపారు  వీరికి శిక్షణ మరియు నైపుణ్యాల తెరపిధిని ఇచ్చి సుమారు పది రోజులు కోచింగ్ క్యాంపు నిర్వహించి వీరికి శిక్షణ ఇస్తారు. అత్యంత వైభవ పిత్తంగా జరిగినటువంటి ఈ యొక్క క్రీడలు నెల్లికుదురు పట్టణానికి వన్నెతెచ్చినట్లు తెలిపారు. ఇంత మారుమూల గ్రామమైనప్పటికీ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజనానికి వసతులు రాష్ట్ర షూటింగ్ వల్ల  తరఫున చేయడం జరిగిందని తెలిపారు ఈ యొక్క క్రీడలలో స్థానిక ఫిజికల్ డైరెక్టర్లు ఇమామ్ ప్రవీణ్ ప్రభాకర్ ప్రణయ్, శంకర్ నాయక్ వెంకటేశ్వర్లు మరియు పిడి మల్లయ్యలు పాల్గొన్నారు కొప్పుల శంకర్ యొక్క క్రీడల పరిశీలకులు డివైస్ ఓ జ్యోతి గారు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -