Monday, September 15, 2025
E-PAPER
Homeసినిమా50 వసంతాల 'లక్ష్మణరేఖ'

50 వసంతాల ‘లక్ష్మణరేఖ’

- Advertisement -

‘నాలోని సహజ నటిని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ‘లక్ష్మణరేఖ’. నేను హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ సినిమాకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంత మంది వారించినా నన్ను హీరోయిన్‌గా పరిచయం చేసిన దర్శకుడు గోపాలకృష్ణకి కృతజ్ఞతలు’ అని నటి జయసుధ అన్నారు. మురళీమోహన్‌, జయసుధ జంటగా నటించిన చిత్రం ‘లక్ష్మణరేఖ’. దీనికి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలై 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన గోల్డెన్‌ జూబ్లీ వేడుకలో దర్శకుడు గోపాలకృష్ణ, మురళీమోహన్‌, జయసుధతోపాటు ఈ చిత్రానికి కో-డైరెక్టర్‌గా పని చేసిన రాజేంద్రప్రసాద్‌ను ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీరంతా 50 ఏళ్లు వెనక్కి వెళ్లి, అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ సుదీర్ఘ ప్రయాణానికి క్రమశిక్షణ, అంకితభావమే కారణమని మురళీమోహన్‌, జయసుధ చెప్పారు.
సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో సీనియర్‌ దర్శకులు ధవళ సత్యం, పి.ఎన్‌.రామచంద్రరావు, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్‌, నిర్మాత టి.రామసత్యనారాయణ, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌, ఫిలిం నగర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడు కాజా సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -