నవతెలంగాణ-భీంగల్ : EHS ను పకడ్బందీగా అమలు చేయాలి. డి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.దాసు ప్రభుత్వం పిఆర్సి నివేదికను వెంటనే తెప్పించుకొని 51 శాతం పేమెంట్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలని అలాగే ఎన్ ఈ హెచ్ ఎస్ అమలులో ఉపాధ్యాయులను ఉద్యోగులను ప్రభుత్వం గందరగోళానికి గురిచేస్తుందని ఈ సమస్యను వెంటనే పరిష్కరించి పకడ్బందీగా అమలు చేయాలని డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.దాసు డిమాండ్ చేశారు.
జిల్లా అధ్యక్షులు ఎం. బాలయ్య మాట్లాడుతూ.. పర్యవేక్షక పోస్టులైన డిఈఓ, డిప్యూటీవోలు, ఎంఈఓ లు ,డైట్ లెక్చరర్లు సీనియర్ లెక్చరర్స్, ప్రిన్సిపాల్ ఖాళీగా ఉన్నాయని ఈ పర్యవేక్షక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కామన్ సర్వీస్ రూల్స్ పరిష్కరించాలని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ఉద్యోగ బాధ్యత నెరవేరుస్తున్న కేజీబీవీ పాఠశాలల్లో పనిచేసే మహిళా ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ (ఎం టి ఎస్) ఇవ్వాలని ,ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయులవలే అన్ని రకాల సెలవులకు అవకాశం ఇవ్వాలని, పని పద్ధతుల్లో స్పష్టమైనటువంటి వర్కు డివిజన్ ఉండాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అలాగే మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో కింద వేతనాలు ఇవ్వాలని, కారుణ్య నియామకాలు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు.
భీంగల్ మండలంలోని జాగిర్యల్, కుప్కల్, బెజ్జోరా ,ముచ్కూర్, పిప్రి, బాచన్పల్లి, కేజీబీవీ తదితర పాఠశాలను సందర్శించి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.దాసు, జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్య కార్యదర్శి షేక్ మదర్ భీంగల్ మండల ప్రధాన కార్యదర్శి గట్టు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.



